ప్లాస్మా డొనేట్ కు ముందుకు వచ్చిన కనికా కపూర్

లక్నో : కరోనాను జయించిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారు. కరోనా జయించిన పేషెంట్ల నుంచి సేకరించి ప్లాస్మాతో కరోనా నయమవుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలని డాక్టర్లు కోరుతున్నారు. ఢిల్లీ, కేరళలో కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. దీంతో కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేయాలని కనికా కపూర్ నిర్ణయించుకున్నారు. ల‌క్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివ‌ర్సిటీ (కేజీఎంయూ) అధికారుల‌కు బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చారు. అన్ని టెస్ట్ ల తర్వాత ప్లాస్మా ను సేకరిస్తామని డాక్టర్లు చెప్పారు. కరోనా బారిన పడిన తర్వాత పలుమార్పు నెగిటివ్ రిపోర్టులు వచ్చినప్పటికీ కనికా కఫూర్ ధైర్యంగా ఉన్నారు. దాదాపు నెల రోజుల ట్రీట్ మెంట్ తర్వాత ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె లక్నోలో ఉంటున్నారు.

Latest Updates