కాణిపాకం ఆల‌యం హుండీ లెక్కింపు పూర్తి

చిత్తూరు: కాణిపాకంలో శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడి దేవ‌స్థానం 24 రోజుల హుండీ ఆదాయం 41.38 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్ తెలిపారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భక్తులను స్వామివారి దర్శనానికి శానిటైజర్ మాస్కులు సామాజిక దూరం పాటిస్తూ అనుమతిస్తున్నారు. 24 రోజుల తర్వాత ఆలయంలో ఉన్న వివిధ హుండీలను గురువారం లెక్కించారు ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు 41,38,796 రూపాయలను హుండీ లో వేయగా బంగారు రథం కోసం 83,191 రూపాయలు, అన్నదానం కు 1785,ప్రచార రథం కు 3077 , బిక్షడి హుండీ ద్వారా 7946 రూపాయలు వచ్చాయి. కాగా స్వామివారి హుండీలో భక్తులు 38 గ్రాముల బంగారం, 258 గ్రాముల వెండి సమర్పించుకున్నారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం లో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈఓ లు రవీంద్ర బాబు, చిట్టెమ్మ విద్యాసాగర్ రెడ్డి, మాధవరెడ్డి తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Kanipakam vinayaka temple hundi count complete under temple staff

Latest Updates