అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్.. ఇద్దరిది స్వార్థమే

మూడు రాజధానుల నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్ పాదయాత్రలో పడ్డ బాధను జనంపై తీర్చుకుంటున్నారన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కన్నా.. చంద్రబాబుపై విసిగి ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారన్నారు. జగన్ పాలనలో ఎవరు సుఖంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజధాని మార్పునకు చెప్తున్న కారణలేవి సహేతుకంగా లేవన్నారు. రాజధాని మార్పునకు ఖర్చు ఒక్కటే కారణం కాదన్నారు. విశాఖలో భూదందా కోసమే రాజధానిని మారుస్తున్నారన్నారు. జగన్ నిర్ణయాలన్నీ పిచ్చి తుగ్లక్ లా ఉన్నాయన్నారు. రాజధాని మార్పుపై ప్రజల తరపున పోరాడతామన్నారు. 2019లో చంద్రబాబుపై కసితో జగన్ ను గెలిపించారు. 2024లో ఏపీ ప్రజల కసి మళ్లీ చూస్తారన్నారు. మేనిఫేస్టోలో మూడు రాజధానుల గురించి చెప్పారా? అని ప్రశ్నించారు. అమరావతిని అపుడు చంద్రబాబు,ఇపుడు జగన్ తన స్వార్థం కోసం వాడుకున్నారన్నారు.

see more news

మొదటి రోజు షేక్ హ్యాండ్..రెండో రోజు రాజీనామా

ఉన్నకాడికి దోచేసి సేవ్ అమరావతా?

 

Latest Updates