రెండో భార్యను చంపేందుకు సినీ నటుడి ప్లాన్

kannada-actor-sabrish-shetty-scheme-murdering-second-wife
  • కాళ్లు చేత్తులు కట్టేసి.. మత్తు మందు ఇచ్చి
  • ప్రతి ఘటించి, కేకలు వేసిన భార్య
  • పొరుగింటి వారి ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు
  • ప్రాణాలతో బతికి బయటపడ్డ భార్య
  • నటుడితోపాటు మరొకరి అరెస్ట్, నలుగురు పరారీ

మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న యువతిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు ఓ సినీ నటుడు. సినిమాల్లో చేసినట్టు నిజ జీవితంలో ఆమెను చంపేందుకు పక్కా ప్లాన్ కూడా వేశాడు.  అది కాస్తా బెడిసి కొట్టడంతో ప్రస్తుతం జైల్లో కటకటాలు లెక్కబెడుతున్నాడు.

శాండల్ వుడ్ కి చెందిన శబరీష్ అనే నటుడు కన్నడలో పలు సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకుతున్న ఓ యువతి (పద్మశ్రీ) ని సినిమాల్లో ఛాన్సులిస్తానని చెప్పి పరిచయం పెంచుకొని ప్రేమలోకి దించాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకొని కేఆర్‌ పురం శివార్లలోని భట్టరహళ్లిలో కాపురం పెట్టాడు.

కొన్నాళ్లకి అతని ప్రవర్తనతో అనుమానం వచ్చిన పద్మశ్రీ.. శబరీష్ కు ఇంతకు ముందే పెళ్లి అయిందని, తనను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నట్టు గ్రహించింది. ఈ విషయమై శబరీష్ ను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు శబరీష్.

వెంటనే తన స్నేహితులకు కబురు పెట్టి ఆమెను చంపేయడానికి ప్లాన్ వేశాడు. అనుకున్న ప్రకారం ఆమె కాళ్లు, చేతులు కట్టేసి,, మత్తు ఇంజక్షన్ ఇవ్వబోయాడు. ఆ క్రమంలో ఆమె ప్రతిఘటించి, గట్టిగా కేకలు వేసింది. ఆమెను ఎలాగైన చంపాలన్న కసితో.. ఆమె నోరు నొక్కి, గట్టిగా చున్నీతో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేయబోయాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అతని తలుపు తట్టారు. ఆమె వేసిన కేకలకు చుట్టుపక్కల వారు విని పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకొని పద్మ శ్రీని శబరీష్ నుంచి కాపాడారు. ఈ ఘటనలో శబరీష్ తో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నలుగురు పరారిలో ఉన్నారు.

Latest Updates