ఇదే నా చివరి వీడియో.. వీడియో పోస్ట్ చేసి హీరోయిన్ ఆత్మహత్యాయత్నం

కన్నడ చిత్రసీమకు చెందిన నటి విజయలక్ష్మి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. దాంతో ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడానికి ముందు.. ఇదే నా చివరి వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. అందులో తన చావుకు గల కారణాలు మరియు ఎవరు కారణమో పేర్కొంటూ వీడియో విడుదల చేశారు. నామ్ తమిలార్ కచ్చి నాయకుడు సీమాన్ మరియు పనాంగ్ కట్టు పాడై కచ్చి పార్టీ లీడర్ హరి నాదర్ అనుచరులు తనను వేధింపులకు గురి చేశారని తెలిపింది. అందుకే చనిపోతున్నానని వీడియోలో చెప్పింది.

ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నా చివరి వీడియో. సీమాన్ మరియు అతని పార్టీ కార్యకర్తల వల్ల నేను గత నాలుగు నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. నేను వారిని భరిస్తూ.. తట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను. హరి నాదర్ నన్ను మీడియాలో చాలా అవమానించారు. నేను కర్ణాటకలో జన్మించినందున నా కన్నడ అభిమానులకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. సీమాన్ నన్ను చాలా హింసించాడు’ అని ఆమె వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం నటి విజయలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె తెలుగులో హనుమాన్ జంక్షన్, పృధ్వీ నారాయణ సినిమాలలో నటించారు.

For More News..

బస్టాండులో గుర్తుతెలియని మహిళ శవం.. శవం పక్కన..

రాష్ట్రపతికి 10వ తరగతి బాలుడి లెటర్

చైనా బిలియనీర్ కు భారత కోర్టు సమన్లు

Latest Updates