డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణికి బెయిల్

బెంగళూరు: డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలులో ఉంటున్న ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేదికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ కంట్రోల్ అధికారులు జరిపిన దాడులు కన్నడ సినీ పరిశ్రమను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారాలు నడుపుతున్న వారితో రాగిణికి సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించి.. దాడులు చేసి అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఇదే కేసులో బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 3వ తేదీన కర్నాటక హైకోర్టు కూడా రాగిణి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నాలుగు నెలలుగా పరారీలో ఉన్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావ, కర్ణాటక మాజీ మంత్రి, జనతా పార్టీ నేత దివంగత జీవరాజ్ అల్వా తనయుడైన ఆదిత్య అల్వాను 10 రోజుల క్రితం కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో రాగిణికి బయటపడడం కష్టమేననుకుంటున్న తరుణంలో ఆమె తాజాగా మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బెయిల్ పిటిషన్ లో తీవ్ర అనారోగ్య సమస్యలు చూపడంతో ట్రీట్మెంట్ కోసం అంటూ చేసిన వినతిని సుప్రీం కోర్టు మన్నించింది.

For More News..

అమ్ముడుపోని టిక్కెట్‌కు రూ. 12 కోట్ల లాటరీ

వైరల్ వీడియో: హలో.. నేను తేజస్వీ యాదవ్ మాట్లాడుతున్నా

చదువు మధ్యలో ఆపేస్తే పూర్తి ఫీజు కట్టాలా.?

Latest Updates