నామినేషన్ దాఖలు చేసిన కన్నయ్య కుమార్

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నేత కన్నయ్య కుమార్ ఇవాళ (మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసరాయ్ పార్లమెంట్ స్థానం నుంచి సీపీఐ తరపున కన్నయ్య పోటీ చేస్తున్నారు. బెగుసరాయ్ పార్లమెంట్ స్థానంలో ఏప్రిల్ 29న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. JNUలో 2016 సంవత్సరంలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, పార్లమెంట్‌పై జరిగిన దాడిలో కీలక పాత్రపోషించిన అఫ్జల్‌ గురును పొగిడాడన్న ఆరోపణలతో కన్నయ్య కుమార్ పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన JNU కమిటీ ఆయనకు జరిమానా విధించింది. అయితే JNU కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు వ్యతిరేకించింది.

Latest Updates