కాన్పూర్‌‌ ఎన్‌కౌంటర్‌‌: 200 మంది పోలీసులపై నిఘా

  • వికాస్‌ దుబేతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో
  • ఇప్పటికే 10 మంది సస్పెండ్

లక్నో: దేశంలోనే సెన్సేషన్‌ సృష్టిస్తున్న కాన్పూర్‌‌ పోలీసులు కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు విచారణ తీవ్రం చేశారు. ఈ మేకరు కేసులో ప్రధాన నిందితుడైన వికాస్‌ దుబేకు సమాచారం ఇచ్చింది పోలీసులే కావడంతో నిఘా పెంచారు. ఈ మేరకు ఆయనతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు ఉన్న 200 మంది పోలీసులపై నిఘా పెంచారు. ముఖ్యంగా చౌబేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన, పనిచేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కాన్సూర్‌‌ ఐజీ మోహిత్ అగర్వాల్‌ అన్నారు. వాళ్లంతా ఒకప్పుడు దుబేతో సంబంధాలు కలిగి ఉన్నవారే అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 10 మందిని సస్పెండ్‌ చేశారు. ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయని అన్నారు. దాదాపు 60 కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు వికాస్‌ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా వారిపై కాల్పులు జరపడంతో 8 మంది పోలీసులు చనిపోయారు. ఆ కేసులో నిందితుడు దుబే పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తున్నారని అతనికి సమాచారం ఇచ్చింది కూడా పోలీసులే. పరారీలో ఉన్న దుబే కోసం వెతుకుతున్న పోలీసులు ఆయనపై రూ.2.5లోల రివార్డు కూడా ప్రకటించారు.

Latest Updates