గాలి కాలుష్యం.. ఏ ఒక్క నేత మాట్లాడడు

Kanpur: The Most Polluted City in the World?
  • దేశంలో గాలి కాలుష్యంపై మాటెత్తని నేతలు
  • 2017లో 12 లక్షల మంది బలి
  • ఈ మధ్యే ‘కాన్పూర్‌ ’కు మోడీ, రాహుల్‌‌
  • యోగి, అఖిలేశ్‌ ,మాయావతి కూడా..
  • ఒక్కరి నోటా రాని పొల్యూషన్‌ మాట

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో కాన్పూర్‌  తొలి స్థానంలో నిలిచింది. టాప్‌ 50 నగరాల్లో 10కి పైగా మన దగ్గరే ఉన్నాయి. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో నరకమే. పీల్చుకోడానికి కూడా గాలి పనికిరాకుండా పోతోంది. అందుకే గాలి కాలుష్యం వల్ల 2017లో దేశంలో 12 లక్షల మంది మృతి చెందారు. ఏటేటా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంత దారుణంగా కాలుష్యం విజృంభిస్తున్నా దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా కాలుష్య నియంత్రణ గురించి మాట్లాడటం లేదు. ప్రధాని మోడీ, కాం గ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ , యూపీ సీఎం యోగి ఆదిత్యనా థ్‌ , మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌ , మాయావతి యూపీలో, ముఖ్యంగా కాన్పూర్‌ లో ఎన్నో ర్యాలీలు చేశారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా దానిపై మాటెత్తలేదు.

ఉండాల్సింది 25.. ఉన్నది 173

గాలి కాలుష్యమనగానే పార్టిక్యులేట్‌  మ్యాటర్‌(పీఎం) 2.5, పీఎం 10ను ఎక్కువగా వింటుంటాం . పీఎం 2.5 అంటే అతి సన్నని దుమ్ము రేణువులు. ఇవి చాలా తొందరగా ఊపిరితిత్తులలోకి చేరి అక్కడే తిష్టవేసి లేనిపోని రోగాలకు కారణమవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం క్యూబిక్‌ మీటరుకు పీఎం 2.5 స్థాయి 25 ఉండాలి. కానీ కాన్పూర్‌ లో ఇది 173. ఒక్కోసారి 400 నుంచి 500 వరకు కూడా వెళ్తుంది. 600 వరకు వెళ్లిన రోజులూ ఉన్నాయి. అందుకే ప్రపంచంలో కాన్పూర్‌ తొలి స్థానంలో ఉందని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సచ్చిదానంద త్రిపాటి చెప్పారు. నిర్మాణ రంగం, వాహనాలు, పరిశ్రమలు, పంటపొలాల్లో వ్యర్థాలను మండించడం వల్ల వచ్చే పొలూష్యనే ఇందుకు ప్రధాన కారణమన్నారు. దీని వల్ల ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని కాన్పూర్‌ లోని జీఎస్‌ వీఎం మెడికల్‌ కాలేజీ పల్మనరీ డిపార్ట్‌‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ చెప్పారు. 2015లో 40 వేల మంది, గతేడాది 60 వేల మంది శ్వాసకోశ రోగాలతో ఆస్పత్రిలో చేరారన్నారు. వీళ్లందరి  ప్రధాన సమస్య ఊపిరి తీసుకోలేకపోవడమని చెప్పా రు. గొంతు మంట, శ్వాసనాళంలో ఇబ్బంది, ఛాతిలో బరువుగా అనిపిం చడం, ఎప్పుడూ దగ్గు రావడం మరిన్ని లక్షణాలని వివరించారు. ఆటో రిక్షా నడిపించేవారు, క్లీనర్లు, డ్రైవర్లు, రోడ్డు పక్కన అమ్ముకునే వారే ఎక్కు వగా ఈ పొల్యూ షన్‌ బారిన పడుతున్నారని చెప్పారు.

తోలు శుద్ధి కర్మాగారాల వల్ల

కాన్పూర్‌ లో జనాభా 40 లక్షలు. ఇదో ఇండస్ట్రియల్‌ హబ్‌ . సుమారు 400 తోలు శుద్ధి కర్మాగారాలున్నాయి. వీటి నుంచి భారీ స్థాయిలో వ్యర్థాలు వస్తుంటాయి. ఇవన్నీ శుద్ధి చేయకుండానే గంగా నదిలోకి వెళ్తుంటాయి. నగరంలో రోజుకు 43 కోట్ల లీటర్ల వ్యర్థాలు వెలువడుతుంటాయి. ఇందులో 25 కోట్ల లీటర్లనే శుద్ధి చేస్తుంటారు. కుంభమేళా సందర్భంగా తోలు శుద్ధి కర్మాగారాలను మూసేయమని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో నీటి కాలుష్యం కాస్త తగ్గింది. మార్చి లో వేడుక అయిపోయిందో లేదో నది కాలుష్యం పెరిగిం ది. గత 30 ఏళ్లలో గంగా నది ప్రక్షాళనకు 30 వేల కోట్లు ఖర్చు చేశారు.

ఒక్క పరికరంతోనే కొలుస్తున్నరు

కాన్పూర్‌ లో కాలుష్యం తీవ్రంగా ఉందని ఆ నగర చీఫ్‌ పొల్యూ షన్‌ ఆఫీసర్‌ కూడా ఒప్పుకున్నారు. దాన్నినియంత్రించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంట వ్యర్థా లు, చెత్తాచెదారాన్ని కాల్చకుండా చర్యలు తీసుకుంటు న్నామని, వాహనాలను తనిఖీ చేస్తున్నామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం డీఎం నేతృత్వం లో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశామని చెప్పా రు. నగరంలో పీఎం 2.5ని కొలిచే పరికరం ఒకటే ఉందని, మరో ఐదు చోట్ల పెట్టాల్సి ఉందని అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెం టల్‌ ఇంజినీర్‌ అనిల్‌ మాథుర్‌ చెప్పా రు. ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవిం చామన్నారు. ఐఐటీ కాన్పూర్‌ ఇప్పటికే చాలా చోట్ల తక్కవ ఖరీదు మానిటర్లను కాన్పూర్‌ , ఢిల్లీల్లో ఏర్పాటు చేసిం దని వివరించారు.

ఆక్సిజన్‌ తో బతకీడుస్తున్నరు

కాన్పూర్‌ కు చెందిన ఆటో రిక్షా డ్రైవర్‌ సేవారామ్‌ (50 ఏళ్లు)కు ఆస్తమా అని, తొమ్మిదేళ్లుగా చికిత్స కోసం తన వద్దకు వస్తున్నాడని, రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండటంతో గత నెలలో ఆయన పరిస్థితి మరింత విషమించిందని డాక్టర్‌ ఆనంద్‌ వివరించారు. ఆయన డ్రైవర్ కాబట్టి డీజిల్‌ పొగను ఎక్కు వగా పీల్చుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు.

ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌‌మెం ట్‌ లో రోజూ సుమారు250 మందిని 19 మంది డాక్టర్ల బృందం పరిశీలిస్తుంటుం దని, వీరిలో ఎక్కువగా ఆస్తమా రోగులేనని చెప్పా రు. బెడ్లు నిండిపోవడంతో నేలపైనా చికిత్స అందించాల్సి వస్తోందన్నారు. ఆస్పత్రికి వస్తున్న వాళ్లంతా పేదవారేనని, ప్రైవేటు వైద్యానికయ్యే ఖర్చు ను భరించలేని వాళ్లేనని వివరించారు. చాలా మంది పేషెంట్లు కేవలం ఆక్సిజన్‌ తో బతుకీడుస్తున్నారన్నారు.2015 నుంచి నస్రీన్‌ బేగం ఆస్పత్రికి వస్తూనే ఉన్నారని, గత నెలలోనే డిశ్చార్జి అయ్యా రని, ఇంతలోనే మళ్లీ చేరారని చెప్పా రు. కాలుష్యం పెరగడం వల్ల గత నాలుగైదేళ్లలో పరిస్థితి మరీ తీవ్రమైందని, ఎక్కు వగా చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు. చిన్న పిల్లలు కూడా శ్వాసనాళ ఆస్తమా చికిత్సకు వస్తుండటం బాధాకరమన్నారు. ఇంతకు ముందు పిల్లలు ఐదారు రోజుల్లో మామూలు స్థితికొచ్చేవారని, ఇప్పుడు రెండు వారాలు పడుతోందని చెప్పా రు. ఊపిరితిత్తుల కేన్సర్‌ కేసులూ ఎక్కు వవుతున్నాయని,గతంలో 55 ఏళ్ల  పైబడిన వారికే జబ్బొచ్చేదని, ఇప్పుడు 40 ఏళ్ల వారికీ వస్తోందని అన్నారు.

 

 

 

 

Latest Updates