సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌కు కపిల్‌‌‌‌ కమిటీ దూరం!

న్యూఢిల్లీ: టీమిండియా నూతన కోచ్‌‌‌‌గా రవిశాస్త్రిని తిరిగి నియమించిన కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)… సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌కు దూరంగా ఉండనుంది. ఈ ప్రక్రియలో సీఏసీ పాలుపంచుకోవాలంటే బీసీసీఐ రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంత సమయం లేకపోవడంతో ఎమ్మెస్కే ప్రసాద్‌‌‌‌ నేతృత్వంలోని నేషనల్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కమిటీనే బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు చేయనుంది.  కోచ్‌‌‌‌గా శాస్త్రిని ప్రకటించే సమయంలో సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ సెలెక్షన్స్‌‌‌‌లోనూ పాల్గొంటామని సీఏసీ తెలిపింది. కానీ, సోమవారం ఉదయం పది గంటలకే ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలవనుంది. ఆలోపు రాజ్యాంగానికి  సవరణ చేయడం సాథ్యం కాదు కాబట్టి  ఆ ప్రక్రియకు కపిల్‌‌‌‌ కమిటీ దూరంగా ఉంటుందని బోర్డు సీనియర్‌‌‌‌ అధికారి ఒకరు తెలిపారు.  కాగా, టీమిండియా అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ను కూడా భర్తీ చేయనున్నారు.

Latest Updates