క‌పిల్ దేవ్ ట్రేడ్ మార్క్ షాట్‌తో రణ్ వీర్ సింగ్‌

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ జీవితంలో జరిగిన విశేషాలతో ‘83’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ర‌ణ్వీర్‌ సింగ్‌ కపిల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కపిల్ ఫెవరేట్ ‘నటరాజ్ షాట్’  ను రిలీజ్ చేసింది మూవీ టీం.

కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 1983లో ప్రపంచకప్ గెలిచింది. ఆ ప్రయాణంలో జరిగిన విశేషాలే ‘83’ సినిమాగా వస్తుంది. ఈ సినిమాకు క‌బీర్ ఖాన్‌ దర్శకత్వం వహిస్తుండగా… రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. 2020 ఏప్రిల్ 10న ‘83’సినిమా విడుదల కానుంది.

Latest Updates