ఈ కార్గిల్ యుద్ధవీరుడు ఫారినరా!

kargil-military-other-country

డిక్లేర్ చేసిన 
అస్సాం ఫారినర్స్‌‌ ట్రిబ్యునల్‌‌

 డిటెన్షన్ క్యాంప్​కు తరలించిన పోలీసులు

గౌహతి: మహ్మద్ సనావుల్లా..ఒకప్పటి కార్గిల్ యుద్ధ వీరుడు. ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ గా సేవలందించారు. రిటైర్ అయిన తర్వాత నుంచి అస్సాం బోర్డర్ పోలీస్ డిపార్ట్ మెంట్​లో సబ్​ఇన్స్ పెక్టర్​గా పనిచేస్తూ 2014లో ప్రెసిడెంట్ మెడల్​ను కూడా అందుకున్నారు. మూడు దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన ఆయన ప్రస్తుతం అక్రమ వలసదారుడు పేరిట అరెస్టయ్యారు. అస్సాంలోని కామరూప్‌‌ జిల్లాకు చెందిన మహ్మద్ సనావుల్లా(52)ను ఫారినర్ గా డిక్లేర్ చేస్తూ బొకో ఫారినర్స్ ట్రిబ్యునల్ బుధవారం తీర్పునిచ్చింది. పోలీసులు ఆయనను అరెస్టు చేసి గోల్​పారా జిల్లాలోని డిటెన్షన్ క్యాంప్​కు తరలించారు.

2008లో తయారైన ఓటర్ లిస్టులో సనావుల్లాను విదేశీయుడిగా నమోదయ్యారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్.. సనావుల్లా ఇండియన్‌‌ అనేందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ బుధవారం ఫైనల్ తీర్పును ప్రకటించింది. ‘ఇది సరైన జడ్జిమెంట్ కాదు. సనావుల్లా సర్వీస్ సర్టిఫికేట్, ఐడీ కార్డును పరిగణలోకి తీసుకోకుండానే ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది. అందులోనూ ఆయన ఆర్మీలో చేరిన తేదీని పదేళ్లు తగ్గించి చూపించారు. ఇదంతా కుట్రలో భాగం. దీనిపై పోరాటం చేస్తాం’ అని సనావుల్లా తరఫు లాయర్ మీడియాతో చెప్పారు. తన పౌరసత్వంపై సనావుల్లా ఇప్పటికే గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జూన్ 13న విచారణ జరగనుంది.

 

Latest Updates