టూరిస్ట్‌‌ స్పాట్‌‌గా కార్గిల్‌

  •  కేంద్రానికి స్థానికుల వినతి

లెహ్‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌తో పాటు లడఖ్‌‌ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కార్గిల్‌‌ను  టూరిస్ట్‌‌ స్పాట్‌‌గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ‘వార్‌‌‌‌ జోన్‌‌’ ట్యాగ్‌‌ పోయి టూరిస్ట్‌‌ డెస్టినేషన్‌‌గా ఇంటర్నేషనల్‌‌ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని అడుగుతున్నారు. “యుద్ధం జరిగి 20 సంవత్సరాలైనా.. యుద్ధం నీడలోనే బతుకుతున్నాం, టూరిస్టులు కేవలం దీన్ని నైట్‌‌ హాల్ట్‌‌గా భావిస్తున్నారు” అని కార్గిల్‌‌కు చెందిన హోటల్‌‌ యజమానులు, టూరిస్ట్‌‌ గైడ్‌‌లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్గిల్‌‌పై ఫోకస్‌‌ పెంచి ఇక్కడి టూరిస్ట్‌‌ స్పాట్‌‌లను అందరికీ తెలిసేలా చేయాలని టూరిస్ట్‌‌ మినిస్టర్‌‌‌‌ మూడు రోజుల కాశ్మీర్‌‌, లడఖ్‌‌‌‌ పర్యటన సందర్భంగా వినతి పత్రం అందజేశారు.

“ అన్ని విషయాల్లో కార్గిల్‌‌ గురించి కాకుండా లెహ్‌‌ గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆర్యన్‌‌ వ్యాలీ, సురు వ్యాలీ, జాన్స్‌‌కర్‌‌‌‌ వ్యాలీ ఉన్నాయి. బుద్ధా రాతి శిల్పాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేశారు” అని స్థానిక హోటల్‌‌ యజమాని ఒకరు చెప్పారు. కార్గిల్‌‌కి ఏటా 1.25 లక్షల మంది టూరిస్ట్‌‌లు వస్తారని, కానీ వాళ్లంతా ఈ ప్లేస్‌‌ను కేవలం నైట్‌‌ హాల్ట్‌‌గానే భావిస్తారని హోటల్‌‌ యజమానులు చెప్తున్నారు. జపాన్‌‌, కొరియా నుంచి దాదాపు 3వేల మంది కార్గిల్‌‌లోని బుద్ధుడి శిల్పాలు చూడటానికి వస్తారని, ప్రభుత్వం దృష్టి పెడితే ఇంటర్నేషనల్‌‌ లెవెల్‌‌లో గుర్తింపు వస్తుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. లెహ్‌‌, కార్గిల్‌‌లో టూరిజమ్‌‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆశిస్తున్నామని స్థానికులు చెప్పారు.

కార్గిల్‌‌ వార్‌‌

ఇండియా – పాకిస్తాన్‌‌ మధ్య 1999 మే నుంచి జులై వరకు దాదాపు మూడు నెలలు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మన సైనికులు500 మంది  అమరులు కాగా.. పాకిస్తాన్‌‌కు చెందిన 400 మంది చనిపోయారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌‌ను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.

కార్గిల్‌‌ ప్రాంతం అందంగా ఉంటుంది. ఇక్కడ 30 హోటళ్లు, అందమైన కొండలు ఉన్నాయి. ఏడాది పొడవునా మంచు వర్షం పడుతుంది. 15000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కాశ్మీర్‌‌‌‌ వ్యాలీ కంటే పెద్దగా.. అందంగా ఉంటుంది. ఇంత అందమైన ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చి, యాత్రికులు వస్తే బాగుంటుంది.- ఆల్‌‌ కార్గిల్‌‌ ట్రావెల్‌‌, ట్రేడ్‌‌ అసోసియేషన్‌‌ మెంబర్‌‌‌‌ అసరఫ్‌‌ అలీ.

Kargil seeks to shrug off its "war zone" tag, claim place as tourist destination

Latest Updates