కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్

kargil-vijay-the-proud-nation-remembers

కార్గిల్ పర్యటనలో ఉన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ నెల 27వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ద్రాస్ లో ఉన్న కార్గిల్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు రాజ్ నాథ్ సింగ్. అక్కడ విధుల్లో సిబ్బందితో ఆయన మాట్లాడారు. కార్గిల్ వార్ పై రూపొందించిన వీడియోను చూశారు.

కశ్మీర్ లో ఉద్యమం నడుపుతున్న వారు.. సమస్య పరిష్కారానికి ఆలోచన చేయాలన్నారు రాజ్ నాథ్ సింగ్. కనీసం ఒకసారి కూర్చుని మాట్లాడితే  ప్రజల సమస్య ఏంటో, ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందన్నారు రాజ్ నాథ్ సింగ్.

Latest Updates