ఇండ్లు కట్టుకుంటామన్నా పర్మిషన్ ఇవ్వని అధికారులు

కరీంనగర్‍, వెలుగు : ప్రభుత్వం ఓ వైపు ఇండ్లు లేనివారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తోంది. కరీంనగర్​లో మాత్రం మా స్థలంలో మేం ఇండ్లు కట్టు కుంటామని అంటున్నా ఆఫీసర్లు పర్మిషన్​ ఇవ్వడం లేదు.గతంలో హెలీప్యాడ్ నిర్మాణానికి ఆ స్థలం సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ​ఇచ్చింది. బాధితులు కోర్టుకు వెళ్లడంతో నోటిఫికేషన్​ రద్దు చేశారు. అయినప్పటికీ ఇండ్లు కట్టు కోవడానికి మాత్రం పర్మిషన్​ ఇవ్వడం లేదు. కరీంనగర్‍ లోని తీగల గుట్టపల్లి గ్రామంలో కేసీఆర్‍ సొంతిల్లు (ఉత్తర తెలంగాణ భవన్‍ ) ఉంది.దీనికి ఎదురుగా ప్రైవేట్​ భూమి సర్వే నంబర్‍ 232లో హెలిప్యాడ్‍ నిర్మాణం చేపట్టడానికి భూసేకరణకోసం డిసెంబర్‍ 29 న కరీంనగర్‍ కలెక్టర్‍ నోటిఫికేషన్‍ ఇచ్చారు. అయితే కరీంనగర్‍ కలెక్టరేట్‌‌లో ఇదివరకే హెలిప్యాడ్‍ నిర్మాణాలు ఉన్నాయని, ఇక్కడ సీఎం వ్యక్తిగత ఇంటి వద్ద మరొకటి ఎందుకు నిర్మించాలి.. దాని కోసం ప్రైవేట్​ వ్యక్తుల భూములను ఎలాలాక్కుంటారని బాధితులు కోర్టు మెట్లెక్కా రు. కోర్టుసైతం బాధితుల పక్షం నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది జనవరి 29న కలెక్టర్‍ భూనోటిఫికేషన్‍ రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చారు. దీంతోసమస్య కొం త సద్దుమణిగింది.

టెంపరరీగా హెలీప్యాడ్ నిర్మాణం

హెలీప్యాడ్‍ నిర్మించాలనుకున్న భూమిలో రెండెక-రాల ఎనిమిది గుంటలు పూర్తిగా ప్లాట్లు చేశారు.ఇందులో సుమారు 40 ప్లాట్లు ఉన్నాయి. వీటినిచాలా ఏళ్ల కిందటే కొనుగోలు చేశారు. ఏటా పన్నులు చెల్లి స్తున్నారు. తొలుత హరితహారం కోసమనిభూమిని చదును చేశారు. హడావిడిగా మరోసారిసీఎం వస్తున్నారు. హెలీప్యాడ్‍ నిర్మించాలని అధికారులు అక్కడివారికి చెప్పారు. రాత్రికి రాత్రే హెలిప్యాడ్‍ నిర్మించారు. ఈ నిర్మాణంలో భాగంగా ఓ వ్యక్తిఇంటి పునాది తీసేశారు. కరెంట్‍ మీటర్‍.. ఇలా అన్నితొలగించి నిర్మాణం చేపట్టారు. బాధితులు అడిగితేఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడి నిర్మాణాలు చేయిస్తామన్నారు. కానీ ఇప్పటిదాక ఎటువంటివిఅందలేదు. అయితే ఎలాగూ ప్రభుత్వమే భూసేక-రణ నోటిఫికేషన్‍ రద్దు చేసుకుంది. తమ ప్లాట్లలోఇళ్ల నిర్మాణాలు చేసుకోవచ్చని సంబురపడ్డారు.కానీ అలాంటిదేం జరగలేదు. నోటిఫికేషన్‍ రద్దు చేసిమూడు నెలలు పూర్తయింది. బాధితులంతా కలెక్టర్‍కార్యాలయాలు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మాత్రం లభించడం లేదు.ఆఫీసర్లు రేపు మాపు అంటూ జాప్యం చేస్తున్నారు.న్యాయం చేయాల్సి న ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులే స్పందించనప్పుడు తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలని బాధితులు వాపోతున్నారు.

 

Latest Updates