వీ6 ఎఫెక్ట్ : డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం

వీ6 ప్రసారాలతో కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ తో ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడంపై  దృష్టి పెట్టారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ, మంటలను అదుపు  చేయాలని అధికారులను ఆదేశించారు నగర మేయర్ రవీందర్ సింగ్. డంపింగ్ యార్డును సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు.

డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన, పొగతో.. జనం, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగతో అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను వీ6 ప్రసారం చేయడంతో..అధికారులతో సమీక్ష నిర్వహించారు మేయర్. త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో.. సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Latest Updates