ఓటమి భయంతోనే MIMతో సభలు పెట్టిస్తుంది

కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే మజ్లిస్ పార్టీతో పలు చోట్ల మీటింగ్ లు పెట్టిస్తుందని అన్నారు బీజేపీ లీడర్, ఎంపీ సంజయ్ కుమార్. మీడియాతో మాట్లాడిన ఆయన… టీఆర్ఎస్ ఇచ్చే ధనంతోనే అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. NRC ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్పినా కావాలని ఆందోళనలు చేయిస్తున్నారని అన్నారు. అమృత పథకం కింద ఇచ్చే వాటితోనే  మిషన్ భగీరథ పనులు చేస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర నిధులుగా వాడుకుంటున్నారని.. మోడీ ఫొటో పెట్టకుండా విశ్వాసఘాతకానికి పాల్పుతున్నరని చెప్పారు.

24 గంటల మంచినీరిస్తామని లేకుంటే ఓట్లడగమన్నా కేసీఆర్ ప్రభుత్వం.. ఇన్నేళ్లైనా భూగర్భ పైపులైను పనులు పూర్తి చేయలేదని అన్నారు బండి సంజయ్. స్మార్ట్ సిటీ కాంట్రాక్టుల కోసం కోట్లాడి కోర్టుకు వెళ్లింది టీఆర్ఎస్ నేతలేనని… ఇప్పుడు మాత్రం కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడంలేదని చెప్తున్నారని అన్నారు. ఒకవేల కేంద్రం ఒక్కరూపాయి ఇవ్వకపోతే కాంట్రాక్టులకోసం కోర్టుకెందుకు వెళ్లారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు కోట్లు ఖర్చుపెట్టి అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారని… ఉన్న మునిసిపాలిటీలే  అభివృద్ధి చెందలేదు.. మళ్లీ గ్రామాలను విలీనం చేశారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి, దేశభక్తి నినాదాలతో ముందుకు పోతామని అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కరీంనగర్ ప్రజలను కోరారు. స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో 30 సీట్లలో గెలుస్తామని చెప్పారు.

ఇవికూడా చదవండి..
కేటీఆర్‌పై విచారణకు ఆదేశించండి

మజ్లిస్​కు 6 మున్సిపాలిటీలు!…TRS​తో MIM అండర్​స్టాండింగ్

లెఫ్ట్ పార్టీల అబద్ధాల ప్రచారం

హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నరు

టెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు

Latest Updates