ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేస్తా: బండి సంజయ్

ఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసే అవకాశం కల్పించిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆ జిల్లా ఎంపీ బండి సంజయ్. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందని, పేదలకు న్యాయం జరుగుతుందని ప్రజలు తమని ఆశీర్వదించారన్నారు. మోడీ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. నమ్మి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అభివృద్ధిని పరిచయం చేయబోతున్నాని అన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి, ఆ పథకాల పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న టీఆరెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచబోతున్నామని సంజయ్ అన్నారు.

Latest Updates