తెలంగాణలో ల్యాండ్ ఇష్యూపై ఢిల్లీలో క‌రీంన‌గ‌ర్ వాసి నిరసన

  •     తన భూమి, తండ్రి ఆత్మహ‌త్యపై న్యాయపోరాటం చేస్తోన్న అనిల్

న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ సర్కార్, రెవెన్యూ అధికారులే తన తండ్రి ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ క‌రీంన‌గ‌ర్ జిల్లా  కాల్వ శ్రీ‌రాంపూర్ గ్రామానికి చెందిన అనిల్​రెడ్డి దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆందోళన చేప‌ట్టారు. గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బాధితుడి వివరాల ప్రకారం.. పెద్దప‌ల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన రాజి రెడ్డికి వార‌స‌త్వంగా వచ్చిన భూమిని ఊరిలోని అదే పేరుగ‌ల వేరే వ్యక్తికి రెవెన్యూ అధికారులు ప‌ట్టా చేశారు. భూమి త‌న‌ద‌ని తన పేరుపైకి మార్చాలని దాదాపు 5 ఏండ్లు రాజిరెడ్డి రెవెన్యూ శాఖ చుట్టూ తిరిగాడు. అయినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయి జూన్ 20 న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి విచార‌ణ చేయించింది. అయిన‌ప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం జ‌ర‌గ‌లేదు. విచార‌ణకు వ‌చ్చిన ఆర్డీవో సైతం రాజిరెడ్డి కుటుంబ బాధ‌ల‌తో చ‌నిపోయాడ‌ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన‌ట్టు మృతుడి కుమారుడు అనిల్ రెడ్డి వాపోయారు. రాష్ట్రంలో తమకు న్యాయం జరగదని ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. రైతుల ‘చలో ఢిల్లీ’ నేపథ్యంలో తన ఆందోళనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. దీంతో, రైతులు ఆందోళన చేస్తోన్న సింఘూ బార్డర్లో వారితో కలిసి నిరసన తెలుపుతున్నట్లు వెల్లడించారు. తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం లంచం ఇవ్వాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. వారసత్వంగా రావాల్సిన భూమిని వెంటనే తన పేరుపై మార్చడంతో పాటూ, తన కుటుంబంతో దురుసుగా మాట్లాడిన పెద్దపల్లి డీఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ, మళ్లీ ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.

    తన భూమి, తండ్రి ఆత్మహ‌త్యపై న్యాయపోరాటం చేస్తోన్న అనిల్

Latest Updates