కరీంనగర్ డిపోలో ఉద్రిక్తత.. అస్వస్తతకు గురైన కార్మికులు

రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ఆర్టీసీ డిపోల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 52రోజుల సుదీర్ఘ  తరువాత విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపుతో డిపోలకు చేరుకుంటున్న కార్మికులు..విధుల్లోకి తీసుకోవాలని డిపో మేనేజర్లకు ధరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే అప్పటికే భారీ కేళ్లతో మోహరించిన పోలీసులు కార్మికుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ డిపోలో ఉద్రిక్తత నెలకొంది. విధుల్లోకి చేరేందుకు వచ్చిన కృష్ణయ్య అనే కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పంటూ కుప్పకూలడంతో కార్మికుడిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా జి.ఎస్. రెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్‌కు కూడా పల్స్ తగ్గిపోవడంతో అస్వస్థత గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పల్స్ పడిపోయి అస్వస్థతకు గురైన మహిళా కండక్టర్ పద్మను కరీంనగర్ సివిల్ అస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స చేసేందుకు వైద్యులు లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ తోటి కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. కరీంనగర్ ఆర్టీసీ డిపో2లో మాత్రం విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికుల నుంచి డిపో మేనేజర్ మల్లేశం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ, విధుల్లోకి వెళ్లడానికి మాత్రం వారికి అనుమతి నిరాకరించారు.

Latest Updates