కార్మికనగర్ వాసుల కష్టాలు పట్టించుకోరా ?

బోరబండ పరిధిలోని కార్మికనగర్ లో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రధానంగా మౌలిక వసతుల లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పేదలు ఇక్కడికొచ్చి తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ముఖ్యంగా మెదక్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన పేదలు ఇక్కడ నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. బోరబండకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన తాత్కాలిక షెడ్లు వేసుకుని దశాబ్దాలుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం, వీధి లైట్లు , డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో చాలా కష్టాలు పడుతున్నారు. ఇక్కడి వారిని ఖాళీ చేయించి రహదారి విస్తరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇక్కడ మొత్తం 300 కుటుంబాలకు పైగా ఉండగా…వారిలో 257 కుటుంబాలకు నగర శివారులోని బీరంగూడ సమీపంలో నిర్మించిన రాజీవ్ గృహకల్పలో నివాసం కల్పించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చొరవతో ఈ కుటుంబాలకు అక్కడ ఆవాసం కల్పించారు. 257 కుటుంబాలు బీరంగూడకు వలస వెళ్లగా మిగిలిన మరో 50 కుటుంబాలకు మాత్రం ఎక్కడా ఆవాసాలు కల్పించలేదు. దీంతో వారు ఇక్కడే సమస్యల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి కూడా నగర శివార్లలో ఇళ్లు ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. దీంతో వీరు రహదారి పక్కన ప్రమాదకర  పరిస్థితుల్లో జీవిస్తున్నారు.బీరంగూడ రాజీవ్ గృహకల్పలో అనేక సమస్యలు ఉన్నాయని… అక్కడికి వెళ్లిన సుమారు ఐదారు కుటుంబాల వారు తిరిగి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అక్కడ సమస్యల మధ్య జీవించాల్సి వస్తుం దని.. ఉపాధి కోసం తిరిగి నగరంలోకి రావాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే తిరిగి ఇక్కడికే వచ్చామని అంటున్నారు. రోజూ కూలీకి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్నామని …తమ బాధలను అధికారులు, పాలకులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాత్కాలిక షెడ్లలో ఉంటున్న తమకు ఎండ, వాన, చలి నుంచి రక్షణ లేదని వాపోతున్నారు. 24 గంటలూ ఇళ్ల ముందు నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని… తమకు, తమ పిల్లలకు రక్షణ లేదని అంటున్నారు. గతంలో రెండుమూడు సార్లు ప్రమాదాలు జరిగి…. గాయాల బారిన పడ్డారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ గోడువినాలని కోరుతున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నాయ్

ఎండ, వాన, చలి నుంచి మాకు సరైన రక్షణలేదు. రేకుల షెడ్లలో ఉంటున్నాం . ఇళ్ల ముందునుం చి 24 గంటలూ వాహనాలు వేగంగావెళ్తుం టాయి. ఎప్పుడూ ఏ ప్రమాదంజరుగుతుం దో అర్థం కావడం లేదు. ఇప్పటికేచాలా మంది ప్రమాదాలు జరిగాయి. 250మందికి బీరంగూడ సమీపంలో ఇళ్లు ఇచ్చారు.అవి సరిగా లేవు. మాకు వేరేచోట అన్ని వసతులతో ఇళ్లు నిర్మిం చి ఇవ్వాలి.-యాదమ్మ, కార్మిక నగర్

సిటీకి దగ్గరగా ఇండ్లు ఇవ్వాలి

సిటీకి మరీ దూరంగా కాకుం డా కొంతదగ్గర్లోనే ఇళ్లు ఇవ్వాలి. ఉపాధివెతుక్కుంటూ ప్రతిరోజూ నగరానికిరావాల్సి వస్తుం ది. అందుకే నగరానికిదగ్గర్లో అనువైన చోట అన్ని వసతులతోఇళ్లు నిర్మిం చి ఇవ్వాలనేదే మా కోరిక.ఇక్కడ సమస్యల మధ్యఉండలేకపోతున్నా . మా సమస్యనుఅర్థం చేసుకొ ని పరిష్కరిం చాలనికోరుతున్నాం .-మల్లేశ్, కూలీ, కార్మిక నగర్

సమస్యల మధ్యే నివాసం

కార్మిక నగర్ లో అనేక సమస్యల మధ్యనివాసం ఉంటున్నాము. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉంది. నగర శివారులోఇండ్లు ఇస్తా మని చెప్పి కొందరికి బీరంగూడ సమీపంలోని రాజీవ్ గృహకల్పలో ఇండ్లు కేటాయించారు.అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయని… అక్కడికి వెళ్లిన వారు చెబుతున్నారు. కొందరు తిరిగి ఇక్కడికే చేరుకున్నారు. మాకు అన్ని వసతులతో కూడిన ఇండ్లు నిర్మిం చి ఇవ్వాలనికోరుకుంటున్నాం-జానకి, కార్మిక నగర్

 

Latest Updates