మోడీ టీ అమ్మి బీజేపీని ధనిక పార్టీగా మార్చారా?

ప్రధాని మోడీ పై తీవ్ర విమర్శలు చేశారు కర్ణాటక సీఎం కుమార స్వామి. మోడీ దేశమంత టీ అమ్మి బీజేపీని ధనిక పార్టీగా మార్చారా? అని ఎద్దేవా చేశారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్న  మోడీ..ఇటీవల కర్వార్ లో బీజేపీ నేత వద్ద రూ. 78 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దేశ భక్తి గురించి తాను మోడీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు కుమార స్వామి. దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు కశ్మీర్ లో ఒక్క దాడి కూడా జరగలేదన్న ఆయన అది తమ ఘనత అని చెప్పుకొచ్చారు. సైనిక దళాలను మోడీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్ వెళ్లినప్పుడు అక్కడ మోడీ ఎటువంటి హమీలు ఇచ్చారో అని సందేహం వ్యక్తం చేశారు కుమార స్వామి.

Latest Updates