నిద్రమాత్రలు మింగిన కర్నాటక సీఎం సెక్రటరీ

బెంగళూరులోని హాస్పిటల్​లో చికిత్స

కండిషన్ స్టేబుల్​గా ఉందన్న డాక్టర్లు

పరామర్శించిన యడియూరప్ప

విచారణకు కాంగ్రెస్ డిమాండ్

బెంగళూరు: కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పొలిటికల్ సెక్రటరీ, బంధువు ఎన్ఆర్ సంతోష్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కండిషన్ స్టేబుల్ గా ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు శనివారం చెప్పారు. సంతోష్ సూసైడ్ అటెంప్ట్ వెనుక రహస్య విషయాలు ఉన్నాయని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శుక్రవారం రాత్రి బెంగళూరు డాలర్స్ కాలనీలోని ఇంట్లో నిద్ర మాత్రలు మింగి సంతోష్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను రామయ్య మెమోరియల్ హాస్పిటల్ కు తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారని, రాత్రి 8.30 గంటలకు హాస్పిటల్ కు తీసుకొచ్చినట్టు రామయ్య హాస్పిటల్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేశ్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. సంతోష్ కండిషన్ స్టేబుల్ గా ఉందని, రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు.

యడియూరప్ప పరామర్శ

శుక్రవారం హాస్పిటల్​కు వెళ్లిన సీఎం యడియూరప్ప.. సంతోష్​ను పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న సంతోష్ ను చూశా. హ్యాపీగానే ఉన్నాడు. ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడో తెలియడం లేదు. అతని కుటుంబంతో మాట్లాడుతా’ అని అన్నారు. ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయన్న వార్తలను సంతోష్ భార్య జాహ్నవి తిరస్కరించారు. ‘ పొలిటికల్​ డెవలప్​మెంట్స్​పై సంతోష్ అప్ సెట్​గా ఉన్నారు. సాయంత్రం బయటకు వెళ్లి రాత్రి 7 గంటలకు తిరిగి వచ్చారు. భోజనానికి పిలిచేందుకు వెళ్తే మాట్లాడే స్థితిలో లేరు. హాస్పిటల్​కు తరలించాం’ అని అన్నారు.

పర్సనల్ వీడియోనే కారణం.. కాంగ్రెస్ నేతల ఆరోపణ

31 ఏళ్ల సంతోష్ సీఎం యడియూరప్ప అక్క మనవడు. యడియూరప్ప ప్రతిపక్ష నేతగా, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడు పర్సనల్ అసిస్టెంట్​గా పనిచేశాడు. గతేడాది కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో క్యాంప్ వేసినప్పుడు సంతోష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది మేలో సీఎం పొలిటికల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నట్టు తెలిసింది. అయితే, యడియూరప్ప సన్నిహిత వర్గంతో విభేదాల వల్ల పొలిటికల్ సెక్రటరీ పోస్టుకు సంతోష్ రిజైన్ చేస్తారన్న వార్తలు వినిపించాయి. ఓ పర్సనల్ వీడియో వల్లే సంతోష్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ అన్నారు. ఓ ఎమ్మెల్సీ, ఒక మంత్రి ఆయనను బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మంత్రులు ఆర్.అశోక్, కేఎస్ ఈశ్వరప్ప ఖండించారు.

For More News..

ఊర్లలో ఫెయిలయిన బిజినెస్ కరస్పాండెంట్ మోడల్

వ్యాక్సిన్ ట్రయల్‌తో ఆరోగ్యం పాడైంది.. రూ. 5 కోట్ల పరిహారమివ్వాలంటూ వాలంటీర్ నోటీసు

నోటాకైనా వేయండి కానీ ఓటేయకుండా ఉండొద్దు

Latest Updates