మళ్లీ ఆస్పత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

కర్ణాటక పీసీసీ అధినేత డీకే శివకుమార్ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. గత నెలలో కరోనా బారిన పడిన డీకే… బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.  అయితే ఆయనకు మళ్లీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారిన పడ్డారు.

Latest Updates