స్పీకర్ ను కలిసిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ను ఆ రాష్ట్ర 10 మంది కాంగ్రెస్- జేడిఎస్ రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం కలిసి రాజీనామాలు సమర్పించారు. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన స్పీకర్..  ఎమ్మెల్యేలంతా సరైన ఫార్మాట్ లోనే రాజీనామా చేశారని, వారి రాజీనామాల విషయంలో ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యం చేస్తున్నాననే వార్తలు తనను బాధించాయని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది. రేపు తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ విప్ గణేష్ హుక్కేరి ఆదేశాలు జారీచేశారు. రేపు సభ ఆర్ధిక బిల్లు ఆమోదం.. ఇతర అంశాలు చర్చకు రానున్న తరుణంలో తమ ఎమ్మెల్యేలంతా తప్పక హాజరుకావాలని పార్టీ ఆదేశించింది.

ప్రస్తుతం విధానసౌధ వద్ద హైడ్రామా నడుస్తుంది. అసెంబ్లీకి హాజరు కావాలని చీఫ్ విప్  జారీచేయడం.. హాజరుకాకపోతే అనర్హత వేటు పడనుందని హెచ్చరించడం అక్కడ రాజకీయాలలో కాకరేపుతుంది.

Latest Updates