కర్ణాటకలో ఎనిమిది జిల్లాల్లో ఆంక్షలు 

కర్ణాటకలో ఎనిమిది జిల్లాల్లో ఆంక్షలు 

కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ, మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్న 8 జిల్లాల్లో వీకెండ్స్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన బెల్గావి, బీదర్‌, విజరుపురా, కల్బుర్గిలతో పాటు కేరళ సరిహద్దులుగా కలిగిన దక్షిణ కన్నడ, కొడగు, మైసూరు, చామరాజ్‌ నగర్‌లలో ఈ కర్ఫ్యూ అమలవుతోంది. అత్యవసర కార్యకలాపాలు మినహా ఎవరూ బయటకి రాకూడదని లేకుంటే కఠిన చర్యలు తప్పవని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. నిత్యావసరాల షాపులు, తోపుడు బళ్లు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరవవచ్చని తెలిపింది. రెస్టారెంట్లు హోమ్‌ డెలివరీ చేయవచ్చని ప్రకటించింది. పబ్‌లు, బార్‌ల్లోకి అనుమతి లేదని, లిక్కర్‌ షాపులకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంబంధిత సంస్థలకు ఈ నిబంధనల నుండి వర్తించవని తెలిపింది.