ఓలా క్యాబ్స్ పై నిషేధం ఎత్తివేసిన కర్ణాటక

కర్ణాటకలో ఓలా క్యాబ్స్ సర్వీసులపై వేసిన నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ప్రకటించారు. ఓలాపై నిషేధం విధించడంతో ఎంతో యువకులు నిరుద్యోగులవుతారని, ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఫిర్యాదులు రావడంతో ఈ సేవలను తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఓలా క్యాబులు ఈ రోజు నుంచి యథావిధిగా నడుస్తాయని తెలిపారు మంత్రి ప్రియాంక్‌ ఖర్గే. ప్రభుత్వ నియమాలకు లోబడి పరిశ్రమలు గానీ కంపెనీలు గానీ నడుచుకోవాలన్నారు. ప్రభుత్వ విధానాలకు దగ్గరగా ప్రైవేటు సంస్థల పాలసీలు ఉండాలన్నారు. ఓలా అంశంపై ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ పీఎం పరమేశ్వరతో మాట్లాడామన్నారు. పెట్టుబడి దారులు, పరిశ్రమలు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఉండాలి తప్ప… ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఎవరి విధానాలు ఉండకూడదన్నారు.

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలను నడపం నిషేధం. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ గత జనవరి నుంచి ఓలా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బైక్‌ ట్యాక్సీలను నిర్వహిస్తోంది. దీంతో రవాణాశాఖ ఓలాకు గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Latest Updates