కర్ణాటక హెల్త్ మినిస్ట‌ర్‌కు క‌రోనా పాజిటివ్

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ఫ్లూ లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా, నేడు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మంత్రి ట్వీట్ చేశారు. చికిత్స నిమిత్తం బౌరింగ్ అండ్ లేడీ కుర్జాన్ ఆస్పత్రిలో చేరారు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో తన శాఖతో కలిపి ప్రభుత్వంలోని అన్ని శాఖలు కోవిడ్-19పై పోరాటం చేశాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను 30 జిల్లాల్లో పర్యటించానని.. ఈ సందర్భంలోనే తనకు కరోనా సోకిందని ఆయన ట్వీట్‌లో తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారు ముందు జాగ్రత్తతో వ్యవహరించి, కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి శ్రీరాములు సూచించారు.

Karnataka Health Minister tests positive for Covid-19; admitted to govt hospital

Latest Updates