గ్యాంగ్ రేప్ శిక్షపై కర్ణాటక హైకోర్టు కీలక వాఖ్యలు

సామూహిక అత్యాచారం చేస్తే మరణశిక్షే కరెక్ట్

చట్ట సవరణ చేయాలంటూ హైకోర్టు సూచన

సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు మరణశిక్షను విధించేలా చట్టంలో మార్పులు చేయాలని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. అలాంటివారికి మరణశిక్షే కరెక్ట్ అని కోర్టు వ్యాఖ్యలు చేసింది. నేషనల్ లా స్కూల్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యార్థినిపై 2012లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులను శిక్షించిన బెంగళూరు సెషన్ కోర్టు.. తీర్పు సమయంలో ఈ సిఫారసు చేసింది.

‘మహిళలపై సామూహిక అత్యాచారాలను అరికట్టడానికి ప్రభుత్వాలు చట్టాన్ని మార్పు చేయడానికి ఇదే సరైన సమయం. సెక్షన్ 376 డి ప్రకారం సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదు విధించడం కొనసాగుతుంది. దీనికి అదనంగా మరణశిక్ష విధించే సవరణ చేయాలి’ అని జస్టిస్ బీ. వీరప్ప మరియు కే. నటరాజన్‌లు తీర్పు ఇచ్చారు.

అదేవిధంగా పాఠ్యాంశాల్లో లింగ సమానత్వంపై కూడా బోధించాలని కోర్టు తన తీర్పులో సిఫారసు చేసింది. మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టాలంటే కఠినమైన శిక్ష ఒక్కటే సరిపోదని కోర్టు పేర్కొంది. ‘ఒక పిల్లవాడు పురుషులను ఏ విధంగా గౌరవిస్తాడో అదేవిధంగా సమాజంలోని స్త్రీలను గౌరవించడం కూడా నేర్పించాలి. లింగ సమానత్వాన్ని పాఠ్యాంశాల్లో భాగంగా చేయాలి. పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు క్రమం తప్పకుండా పిల్లలకు వ్యక్తిత్వం పెంపొందించడం మరియు నైపుణ్యాన్ని పెంచే వ్యాయామాలలో శిక్షణ ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తనా సరళిని గమనిస్తూ ఉండాలి. విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, కంపెనీల యజమానులు లింగ సున్నితత్వానికి సంబంధించి అవగాహన కల్పించడానికి మరియు మహిళలను గౌరవించడానికి తగు చర్యలు తీసుకోవాలి. సమాచార మాధ్యమాల ద్వారా లింగ న్యాయం గురించి ప్రజలకు తెలియజేయాలి’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

For More News..

దేశంలో కొత్తగా 43,893 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1,481 కరోనా కేసులు

రైతులకు పంట నష్టం కేంద్రమిస్తేనే.. మేమిస్తం

Latest Updates