రాజీ పడలేక రాజీనామా చేసిన ఐఏఎస్

దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శశికాంత్‌‌‌‌‌‌‌‌ సెంథిల్‌‌‌‌‌‌‌‌ తన ఉద్యోగానికి శుక్రవారం రిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. “గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యంలో రాజీ ధోరణులు పెరిగిపోతున్నాయని” ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌కి రాసిన లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంథిల్‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. పర్సనల్‌‌‌‌‌‌‌‌ రీజన్‌‌‌‌‌‌‌‌ వల్లే పదవికి రిజైన్‌‌‌‌‌‌‌‌ చేశానంటూనే.. ఈ కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వంలో ఒక సివిల్‌‌‌‌‌‌‌‌ సర్వెంట్‌‌‌‌‌‌‌‌గా కొనసాగడం అనైతికమన్నారు. “ దక్షిణ కన్నడ ప్రజలు, ప్రజా ప్రతినిధులు నా మీద చాలా ప్రేమ చూపించారు. రిజైన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నందుకు వారికి సారీ చెప్తున్నాను. ఎవరి వల్లా ఇబ్బంది పడి రాజీనామా చేయడం లేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం” అని చెప్పారు. 2009 ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన సెంథిల్‌‌‌‌‌‌‌‌ సొంత రాష్ట్రం తమిళనాడు. 2017లో దక్షిణ కన్నడకు డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమితులయ్యారు. అంతకు ముందు కర్నాటకలోని రాయచూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాంతాల్లో పనిచేశారు.

సెంథిల్‌‌‌‌‌‌‌‌ కంటే ముందు ఈ ఏడాది మరో ఇద్దరు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌లు తమ ఉద్యోగాలకు రిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విధించిన ఆంక్షలను నిరసిస్తూ దాద్రా నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హవేలీ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కన్నాన్‌‌‌‌‌‌‌‌ గోపినాథన్‌‌‌‌‌‌‌‌ ఆగస్టులో రాజీనామా చేశారు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా ఫైజల్‌‌‌‌‌‌‌‌ జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు.

Latest Updates