మోడీకి మద్దతివ్వని వాళ్లు దేశవ్యతిరేకులే:వివాదంలో BJP నేత

సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. నరేంద్రమోడీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. నమో ఫీవర్ ను దేశమంతా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కర్ణాటక బీజేపీ నేత ఒకరు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి.

బెంగళూరు సౌత్ స్థానం నుంచి బీజేపీ నేత తేజస్వి సూర్య లోక్ సభ రేసులో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రధానమంత్రి మోడీ- ఓటర్లను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ ఎన్నికైతే భారత్ .. ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని… ఆయుధ సంపత్తిలో పాకిస్థాన్ ను భయపెట్టడమే కాకుండా… ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. దేశంపై ప్రేమ ఉన్నవాళ్లంతే నరేంద్రమోడీ వెంటే ఉన్నారని చెప్పారు. ఎవరైతే నరేంద్రమోడీకి మద్దతు ఇవ్వరో వాళ్లంతా దేశవ్యతిరేకులతో సమానం అని తేజస్వి సూర్య ఆయన కామెంట్ చేశారు.

బీజేపీ నేత కామెంట్స్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

తేజస్వి సూర్య చేసిన ఈ కామెంట్స్ పై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఎన్నికల వేళ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారంటూ ఎన్నికల సంఘానికి కన్నడ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

 

Latest Updates