రైతు దోస్త్ ఎవరు? ఏ) కుమారస్వామి.. బీ) వానపాములు.. సీ) యడ్యూరప్ప

మీకో ప్రశ్న. రైతు దోస్త్ ఎవరు? జవాబురాదా! అయితే ఈ ఆప్షన్లలో ఒకదాన్నిఎంచుకోండి. ఏ) కుమారస్వామి బీ) వానపాములు సీ) యడ్యూరప్ప! ఏం.. జోకులేస్తున్నారా అని గుస్సా కాకండి. ఇదేమీ రాజకీయప్రశ్న కాదు. కర్నాటకలో ఓ స్కూల్ విద్యార్థులకు పెట్టిన వార్షిక పరీక్షల్లో వచ్చిన ప్రశ్నఇది. బెంగళూరు రాజరాజేశ్వరీ నగర్ లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లిష్ హై స్కూల్ లో 8వతరగతి ప్రశ్నపత్రంలో ఈ క్వశ్చన్ అడిగారుమరి. ఆ ప్రశ్న చూసి విద్యార్థులతో పాటు వాళ్లతల్లిదండ్రులు నోరెళ్లబెట్టారు. దానికి జవాబు వానపాములు అని విద్యార్థులకు తెలుసుకాబట్టి సరిపోయిందని, ఆ ఇద్దరి పేర్లలో ఒకరిపేరును టిక్ చేస్తే పరిస్థితేంటని కొందరు నవ్వుకుంటున్నారు. ఆ ప్రశ్నపత్రం ట్విట్టర్ లోహల్ చల్ చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్నటైంలో ఇలాంటి ప్రశ్నలేంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Latest Updates