బోల్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన కన్నడ వీరుడు..9.55 సెకన్లలో 100 మీటర్లు

శ్రీనివాస గౌడ..కర్ణాటకలోని కంబాల క్రీడలో అత్యంత వేగంగా దున్నపోతులతో పరుగెత్తి  ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్నాడు. అత్యంత వేగంగా పరుగెత్తేది ఎవరని అంటే ఇప్పటి వరకు జమైకా బోల్ట్ అని తెలుసు.కానీ ఇపుడు  కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ(28) పేరు చెప్పుకోవాలేమె. ఎందుకంటే..మంగళూరులోని ఈ నెల 1 న నిర్వహించిన కంబాళ క్రీడలో దున్నపోతులతో కలిసి శ్రీనివాస గౌడ 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో పరుగెత్తాడు అంటే 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తినట్లు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా అంతర్జాతీయ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా శ్రీనివాస గౌడ పరుగెత్తాడని అభిప్రాయపడుతున్నారు. బోల్ట్  100 మీటర్ల రేసులో 9.58 సెకన్లలో పూర్తి చేసి ఇప్పటి వరకు ప్రపంచ నంబర్ వన్ గా ఉన్నాడు. కానీ శ్రీనివాస గౌడ 9.55 సెకన్లలోనే పరుగెత్తి ఔర అనిపిస్తున్నాడు. ఇతని వేగం చూసిన వాళ్లంతా ఔర అనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశసంలు కురిపిస్తున్నారు.

కంబాళ అనేది కర్ణాటకలోని ఉడిపి, తుళునాడు ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయ క్రీడ. ఇందులో రెండు ఎద్దులతో బురదనీటిలో పరుగెత్తాలి. ఎవరైతే ఎద్దులను పరుగెత్తిస్తూ  గమ్యాన్నిచేరుకుంటారో వారే విజేతగా నిలుస్తారు. ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస గౌడ గత 12 కంబాళ పోటీల్లో 29 బహుమతులు గెలుచుకున్నాడు. లేటెస్ట్ గా మంగళూరులోని ఐకళ ప్రాంతంలో జరిగిన కంబాళ పోటీల్లో పాల్గొని ఈ రికార్డ్ సృష్టించాడు శ్రీనివాస గౌడ.

ఈ వీడియోపై  టైకూన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో స్పందించారు. శ్రీనివాస గౌడకు గోల్డ్ మెడల్ ఇవ్వాలన్నాడు. అతనికి శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ గేమ్స్ కు పంపించాలన్నారు .లేకపోతే కంబాళ గేమ్ ను ఒలింపిక్స్ లో చేర్చాలన్నారు. మహీంద్ర ట్వీట్స్ కు బదులిచ్చిన కేంద్రమంత్రి రిజీజు టాలెంట్ ఉన్నవాళ్లను ఎవరూ వదులుకోరన్నారు. తప్పకుండా శ్రీనివాస గౌడను కోచింగ్ కు పిలుస్తామన్నారు.

Latest Updates