లాక్ డౌన్ బ్రేక్ చేసి కర్నాటక ఎమ్మెల్యే బర్త్ డే పార్టీ

బెంగళూరు: కర్నాటకలో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అమలు చేసిన లాక్ డౌన్ ను ప్రజా ప్రతినిధులే బ్రేక్ చేస్తున్నారు. శుక్రవారం ఓ ఎమ్మెల్యే వందల మంది సమక్షంలో బర్త్ డే పార్టీ చేసుకుని లాక్ డౌన్ ను ఉల్లంఘించారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా అనుచరులు, గెస్ట్ ల మధ్య కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. తుమకూరు జిల్లా తురువేకెరె ఎమ్మెల్యే ఎం.జయరాం బర్త్ డే పార్టీ జరుపుకున్నారు. గుబ్బి టౌన్ లో జరిగిన ఈ పార్టీకి చిన్నారులు కూడా అటెండ్ అయ్యారు.బర్త్ డే పార్టీలో భాగంగా ఎమ్మెల్యే బిర్యానీ విందు కూడా ఇచ్చారు. గత నెల 15న కర్నాటక సీఎం యడియూరప్ప కూడా బెళగావిలో పెళ్లి వేడుకకు అటెండ్ అయ్యారు. ఆ మరుసటి రోజే కేపీసీసీ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయిన డీకే శివకుమార్ ను సన్మానించేందుకు వందల మంది కాంగ్రెస్ వర్కర్లు ఒక్క చోట చేరి సోషల్ డిస్టెన్స్ రూల్ ను బ్రేక్ చేశారు. కర్నాటకలో ఇప్పటివరకు 6 వేల మందికిపైగా కరోనా సోకగా 200 మందికిపైగా చనిపోయారు.

Latest Updates