ఆ 17మంది ఎమ్మెల్యేలు అనర్హులే..

కర్ణాటక అనర్హత  ఎమ్మెల్యేల  కేసులో  సుప్రీంకోర్టు  తీర్పు వెల్లడించింది. అప్పటి  స్పీకర్ రమేష్  తీసుకున్న నిర్ణయాన్ని  సమర్థించింది  సుప్రీంకోర్టు. కుమార స్వామి  సర్కార్  బలనిరూపణ  సమయంలో 17 మంది  ఎమ్మెల్యేలు  విప్ ధిక్కరించారు. ఐతే పోటీ  చేయకుండా  స్పీకర్ ఇచ్చిన  ఆదేశాల నుంచి  మినహాయింపు నిచ్చింది. డిసెంబర్ 5 న జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీచేయడంపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేరని చెప్పింది. వేటు పడిన ఎమ్మెల్యేల్లో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా… ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలుగా  ఉన్నారు.

Latest Updates