మే 4 నుంచి మాల్స్, లిక్క‌ర్ షాపులు ఓపెన్?

మ‌రో రెండు రోజుల్లో కేంద్ర ప్ర‌క‌టించిన లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో కర్ణాటక ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యాలు తీసుకోనుంది. మే 4 నుంచి షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలను తెరిచే యోచ‌న‌లో ఉంది. వీటితో పాటు ఇతర వ్యాపార సంస్థలను కూడా తెరవాలని నిర్ణయించింది. అలాగే మే 15 వరకు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడపరాదని కూడా నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతుందని తెలిపింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలతోపాటు 15 ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, దుకాణాలు తెరించేందుకు గురువారం అనుమతి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే షాపింగ్ మాల్స్ , లిక్క‌ర్ షాపు ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల కోసం వేచి చూస్తోంది.

Latest Updates