మాజీ ఆర్మీ ఉద్యోగి కాల్ తో బెంగుళూరు పోలీసులు హై అలర్ట్

బెంగళూరు: కర్ణాటక పోలీసులకు చుక్కలు చూపించాడు ఓ లారీ డ్రైవర్. రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారని పోలీసులకు తప్పుడు సమాచారాన్ని అందించాడు. బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తగా హై అలర్ట్ అయ్యారు. అయితే ఆ తర్వాత అది రాంగ్ కాల్ అని తెలుసుకున్న బెంగళూరు పోలీసులు ..ఫోన్ చేసిన అతడి వివరాలు తెలుసుకుని అరెస్ట్ చేశారు. అతడిని స్వామి సుందర మూర్తి(65)గా గుర్తించారు.

మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన సుందరమూర్తి ఇప్పుడు లారీ డ్రైవ‌ర్‌ గా చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. ఉగ్ర‌వాదులున్నారంటూ బెదిరింపు కాల్ రావ‌డంతో.. కోలార్‌, బెంగుళూరు పోలీసులు ప్ర‌త్యేక స్క్వాడ్‌ గా మారి ఆ వ్య‌క్తి కోసం వెతికామని.. బెంగుళూరు శివార ప్రాంత‌మైన అవ‌ల‌హ‌ల్లిలో అత‌న్ని అరెస్టు చేశామని తెలిపారు. సుందరమూర్తి అలా ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతామన్నారు.

Latest Updates