రేప్ కామెంట్స్: కర్ణాటక ఎమ్మెల్యేలకు స్పీకర్ సారీ

బెంగళూరు: కర్ణాటక ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ బుధవారం నాడు సభలో క్షమాపణ చెప్పారు. తాను రేప్ బాధితుడిలా ఫీల్ అవుతున్నానంటూ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సభ్యులను నొప్పించి ఉంటే క్షమించాలన్నారు. ఆ ఇష్యూను మీడియా కావాలని హైప్ చేస్తోందని అన్నారాయన.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేత యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ – జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప మాట్లాడిన ఆడియో టేపులంటూ కొన్ని క్లిప్స్ ని బయటపెట్టాయి. వాటిపై విచారణ జరిపించాలని స్పీకర్ రమేశ్ కుమార్ ను డిమాండ్ చేశాయి. దీనిపై స్పీకర్ ఆదేశాలివ్వడంతో సిట్ రంగంలోకి దిగింది. దీనిపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే అందులో స్పీకర్ ప్రమేయం ఉందంటూ కొందరు సభ్యులు పదే పదే ఆరోపించడంతో ఆయన సహనం కోల్పోయారు. ఆ సమయంలో ఆయన తన పరిస్థితి రేప్ బాధితుడిలా ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బుధవారం క్షమాపణ చెప్పారు.

Latest Updates