కొంపముంచిన హంపి ఎక్స్ ప్రెస్: 500 మంది పరీక్ష రాయలేకపోయారు

హంపీ ఎక్స్ ప్రెస్ 7గంటలు లేటుగా నడవడంతో 500మంది విద్యార్థులు NEET(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష రాయలేకపోయారు. కర్ణాటక రాష్ట్రం కొప్పళ, బళ్లారి జిల్లాలనుంచి ఆదివారం ఉదయం సుమారు 500 మంది విద్యార్థులు NEET పరీక్ష రాయడానికి హంపి ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరుకు బయలుదేరారు. నిర్ధేశించిన సమయం ప్రకారం… ట్రైన్ ఉదయం 7గంటలకు బెంగళూరుకు చేరుకోవాలి. అయితే ఇంటర్ లాకింగ్ పనుల వల్ల ఆ రైలును దారి మల్లించారు. ఈ విషయం తెలియని విద్యార్థులు హంపి ఎక్స్ ప్రెస్ లో ఎక్కారు.  దీంతో ఉదయం 7 గంటలకు బెంగళూరుకు చేరుకోవలసిన రైలు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు చేరుకుంది. దీంతో ఎగ్జామ్ సెంటర్ కు విద్యార్థులు లేటుగా వెళ్లారు. అయితే.. పరీక్షా హాల్ లోకి అధికారులు అనుమతించలేదు. 2గంటలకు పరీక్ష మొదలవనుండగా.. 1.30 నిమిషాలకే ఎగ్జామ్ హాల్ లోకి చేరుకోవాలనే నిబంధనను సాకుగా చూపించారు. పరీక్ష రాయకుండానే 500మంది విద్యార్థులు వెనుదిరిగారు. ఈ విషయం పై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. కేంద్ర రైల్యే మంత్రి పియూష్ గోయల్ చేతకానితనం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని అన్నారు.

Latest Updates