రోజంతా బయట నిలబెట్టిందని.. తల్లినే పొడిచి చంపాడు

  • కర్నాటకలో జరిగిన ఘటన

బెంగళూరు: కర్నాటకలోని మండ్యా టౌన్‌లో ఘోరం జరిగింది. మందలించిందని, ఒక యువకుడు తల్లినే హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నాటకలోని మండ్యాలో తల్లి, కొడుకు చాలా కాలం నుంచి నివాసముంటున్నారు. కొడుకు రోజు స్నేహితులతో బయట తిరిగి ఇంటికి లేటుగా తిరిగివస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ తన కొడుకును మందలించింది. ఒక రోజు రాత్రంతా ఇంటి బయటే నుంచో బెట్టింది. దీంతో కోపానికి గురైన ఆ యువకుడు తల్లిని కత్తితో పొడిచి చంపాడని పోలీసు అధికారులు చెప్పారు. జులై 30న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు.

Latest Updates