క‌ర్ణాట‌క‌లో లాక్ డౌన్​ రూల్స్​ సడలింపు

బెంగళూరు: లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న క‌ర్ణాట‌క‌ ప్రజలకు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్​ చెప్పింది. ఈ నెల 23 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించింది. నిర్మాణ కార్యకలాపాలు, ప్యాకింగ్ ​మెటీరియల్ ​తయారీ, కొరియర్ సర్వీసులను అనుమతిస్తారు. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్లు, మోటార్​ మెకానిక్స్, కార్పెంటర్లు ఇతర సెల్ఫ్​ఎంప్లాయిస్​కు కూడా తమ పనులు చేసుకునేందుకు వీలు కల్పించారు. 50 శాతం సిబ్బందితో టీ, కాఫీ, రబ్బర్​ప్లాంటేషన్ ​సంస్థల్లో పనులు చేసుకోవచ్చు. కంటెయిన్‌మెంట్ జోన్లలో మాత్రం ఎలాంటి సడలింపులు ఉండవని, కంటెయిన్‌మెంట్​ జోన్ల బయట వాటికి మాత్రమే ఈ సడలింపులు వర్తిస్తాయని చీఫ్ సెక్రెటరీ టీఎమ్​ విజయ్​భాస్కర్​ చెప్పారు.

Latest Updates