మరదలు పెళ్లికి ఒప్పుకోలేదని.. కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి కట్టిన బావ

బెంగళూరు: పెళ్లికి ఒప్పుకోలేదని మరదలి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. బలవంతంగా లాక్కెళ్లి తాళి కట్టి పైశాచికానందం పొందాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో జరిగింది. మను అనే యువకుడు తన మరదలిని ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే తనకు ఇష్టం లేదని ఆ యువతి చెప్పడంతో ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని రాక్షస ప్రయత్నానికి దిగాడు. బస్సు కోసం రోడ్డుపై నిల్చుని ఎదురు చూస్తున్న మరదలిని స్నిహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు మను. బలవంతంగా కారులోకి లాక్కెళ్లి అక్కడిని నుంచి పరారయ్యారు. ఆ తర్వాత రన్నింగ్ కారులో తన పంతం నెగ్గించుకున్నాడు.

ఆ యువతి ఎంతగా బతిమిలాడినా వినలేదు. తనకు ఇష్టం లేదని ఏడుస్తూ వేడుకున్నా.. ససేమిరా వినకుండా మను తాళి కట్టాడు. ఈ దుర్మార్గానికి అతడి స్నేహితులు సహకరించారు. ఆ యువతి మను అమానుష ప్రయత్నం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. మను స్నేహితుడొకడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. రన్నింగ్‌లో ఉన్న కారులో జరిగిన దుర్మార్గాన్ని మరో స్నేహితుడు వీడియో తీశాడు.

ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతిని మను తన స్నేహితుడి ఇంట్లో బంధించాడని, ఆమెను కాపాడాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates