మీడియా ముందే సిద్ధరామయ్య చెంప దెబ్బ.. వీడియో వైరల్

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి సహనం కోల్పోయారు. మీడియా ముందు కాంగ్రెస్ నేత చెంప చెల్లుమనిపించి హాట్ టాపిక్ గా మారారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైసూరు,కొడగు వరద ప్రాంతాల్లో పర్యటించి వస్తుండగా మైసూరు ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అరెస్ట్ పై  సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. మాట్లాడి వెళ్లిపోతుండగా పక్కన ఉన్నకాంగ్రెస్ లీడర్ ఏదో చెప్పబోతుండగా సిద్ధరామయ్య అతని చెంపపై కొట్టాడు. ఇదంతా మీడియా ముందే జరగడంతో వీడియో వైరల్ అయ్యింది.

Latest Updates