నటి సంజన “హై ఫై పార్టీలకు” డ్రగ్స్ కూడా సప్లై చేసేదట!

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులో వస్తున్నాయి. శాండిల్ వుడ్ కి డ్రగ్స్ సరఫరా చేసిన దక్షిణాఫ్రికాకు చెందిన లూమ్ పెప్పర్ సాంబాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం సీసీబీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో పెప్పర్ అనేక విషయాలు వెల్లడించాడు.

శాండిల్ వుడ్ తో పాటు పలువురు సెలబ్రిటీలకు తాము డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా రాగిణి, సంజన, రవిశంకర్, వీరేన్‌ ఖన్నాలు ఉడేన్నాతో సంప్రదించినట్లు నిర్ధారణైంది.
లూమ్ పెప్పర్ చెప్పిన వివరాలు, సంజన ఇంట్లో దొరికిన ఆధారాలతో సంజన హై – ఫై పార్టీలలో పాల్గొనడంతో పాటు ప్రకాశ్‌ రాంకా, రాహుల్‌తో కలిసి బెంగళూరు, గోవా, కేరళ, శ్రీలంకలో పబ్, బార్, అపార్ట్‌మెంట్‌ పార్టీలకు డ్రగ్స్‌ను గుట్టుగా సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

Latest Updates