పాక్ లో ఉన్న కర్తార్ పూర్ గురుద్వారా విశేషాలివే..!

పాకిస్తాన్ లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలం కర్తార్ పూర్ గురుద్వారా. ఇక్కడ గురునానక్ చాలాకాలం పాటు నివసించారు. దేశ విభజనలో భాగంగా ఈ ప్రాంతం పాక్ లోకి వెళ్లిపోయింది. అయితే ఇది భారత్ కు కేవలం 4కిలో మీటర్ల దూరంలో ఉంది. భారత భూబాగంలోనుంచి బైనాక్యులర్ పెట్టుకుని చూస్తే కనిపిస్తది. అయితే భారత్ లో ఉన్న భక్తులకు ఇప్పటి వరకు అక్కడికి వెళ్లడానికి వీలు లేకుండె… గత సంవత్సరం ఇరు దేశాల ప్రభుత్వాలు కర్తార్పూర్ కారిడార్ నిర్మాణానికి మందుకు వచ్చాయి. ఈరోజు ఇరు దేశాల ప్రధానులు కారిడార్ ను ప్రారంభించనున్నారు. దీంతో ఇక్కడి నుంచి భక్తులు గురుద్వారాను దర్శించుకునే వీలుంది.

కర్తార్ పూర్ గురుద్వారా దర్బార్ సాహెబ్ విశేషాలు ఇవీ.

1.సిక్కుల గురువు గురునానక్ దేవ్.. కర్తార్పూర్లో 18 ఏళ్లపాటు నివసించారు. దీంతో సిక్కులు ఆ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది గురునానక్ 550 జయంతిని పురస్కరించుకుని కారిడార్ నిర్మాణం చేపట్టారు.

2.గతేడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తిచేశారు.

3.ఇండియా సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ కారిడార్ ఉంది. పంజాబ్లోని గురుదాస్పూర్నుంచి కూడా కర్తార్పూర్ కనిపిస్తుందని చెబుతారు.

4.కారిడార్లో 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ ప్యాసింజర్ టర్మినల్ నిర్మించారు.

5.రోజూ ఇండియా నుంచి ఐదు వేల మంది, పాక్ నుంచి ఐదు వేల మంది సందర్శించుకునేందుకు అనుమతిస్తారు.

Latest Updates