చిరూ టైటిళ్లనే నమ్ముకున్న కార్తీ

మొన్న ఖైదీ… నేడు దొంగ..
కార్తీ ‘దొంగ’ టీజర్ విడుదల

హీరోయిన్, పాటలు లేకుండా కేవలం కథతోనే ‘ఖైదీ’ సినిమా ద్వారా హిట్ కొట్టిన కార్తీ.. ఇప్పుడు ‘దొంగ’ గా వచ్చేస్తున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘దొంగ’. ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, సూరజ్ సదానా నిర్మిస్తున్నారు. తమిళంలో ‘తంబి’ గా వస్తున్న ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ గా రాబోతోంది. ఈ సినిమాలో కార్తీ రియల్ లైఫ్ వదిన, హీరో సూర్య భార్య అయిన జ్యోతిక కార్తీకి అక్కగా నటిస్తోంది. వీరితో పాటూ మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు. ఈ మధ్యే రిలీజయిన ‘ఖైదీ’, త్వరలో రాబోతున్న ‘దొంగ’ ఈ రెండు సినిమాలు చిరంజీవి నటించిన సినిమా టైటిళ్లు కావడం విశేషం. ఈ సినిమా టీజర్‌ను తమిళంలో హీరో సూర్య విడుదల చేయగా, తెలుగులో హీరో నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Latest Updates