ఎమ్మెల్యే నన్ను ప్రేమతో కొట్టారు

సోషల్‌‌మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ప్రేమతోనే కొట్టాడని చెబుతున్న బాధితుడు

హైదరాబాద్​:వెలుగు : మజ్లీస్​పార్టీకి చెందిన కార్వాన్‌‌ ఎమ్మెల్యే కౌసర్​ మొహియుద్దీన్​ ఒక వ్యక్తిని కర్రతో కొడుతున్న వీడియో సోషల్‌‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాధితుడు నక్కో మారో సాబ్‌‌….అని వేడుకుంటున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. ఎమ్మెల్యేతో పాటు మరికొందరు వ్యక్తులు ఉండగా ఒకరి దగ్గరికి తీసుకువెళ్లి  ‘కడుపులో తలపెట్టి క్షమించుమని అడుగు’  అని ఎమ్మెల్యే అనడంతో, అందుకు బాధితుడు  నిరాకరించడంతో మళ్లీ కొట్టారు. ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలియదు… కానీ దీనికి అనుబంధంగా బాధితుడు మాట్లాడిన వీడియో కూడా సోషల్‌‌మీడియాలో తిరుగుతోంది. అందులో ‘ మా ఎమ్మెల్యే మంచి వారు. నాకు ఆయనతో వైరం లేదు. నన్ను ప్రేమతో కొట్టారే తప్ప.. ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాదు. నా కుటుంబ అవసరాలకు ఎమ్మెల్యే ఎంతో సాయం చేశారు.  కావాలనే కొందరు ఆ వీడియో పోస్ట్‌‌ చేశారు’ అని బాధితుడు చెబుతున్నాడు.

Latest Updates