రాంగ్ రూట్ చూపించిన గూగుల్ మ్యాప్ : నదిలోకి వెళ్లిన కారు

రాంగ్ రూట్ చూపించిన గూగుల్ మ్యాప్ : నదిలోకి వెళ్లిన కారు

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ఎంత పనిచేసింది!..సాధారణంగా మనం తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు అడ్రస్ కోసం స్థానికులను అడిగి తెలుసుకుంటాం.. లేదా స్నేహితులు, బంధువులనో  అడిగి తెలుసు కుంటాం. అది గతం..ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీలో వంటి మెట్రో నగరా లతో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో  కమ్యూటర్స్ గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటున్నారు. అయితే గూగుల్  మ్యాప్ కొన్నికొన్ని సార్లు తప్పుడు సమా చారం అందిస్తుందని ఇటీవల కాలంలో చాలా కంప్లైంట్లు వస్తు్న్నాయి.గూగుల్ రూట్ మ్యాప్ ను నమ్ముకొని రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదంలో పడిన సంఘటనలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో ఓ లారీ డ్రైవర్ కు..గూగుల్  మ్యాప్ రాంగ్ రూట్ చూపించడంతో  లారీ ఓ చెరువులోకి వెళ్లింది. మరో ఘటనలో ఓ కారు అడవిలోకి వెళ్లి దారి తప్పింది. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. తాజాగా అలాంటి సంఘటనే కేరళలో జరిగింది. గూగుల్ మ్యాప్ రాంగ్ రూట్ చూపించడంతో ఓ కారు ఏకంగా నది ప్రవాహంలో పడిపోయింది. టెక్నికల్ లోపమా లేదా.. సిగ్నల్ లేకపోవడం వల్ల జరిగిందా..కారణం ఏదైనా గూగుల్ ను నమ్ముకుని ఇబ్బందుల్లో పడుతున్నారు కమ్యూటర్స్.. వివరాల్లోకి వెళ్లితే.. 

కేరళలోని కన్హాన్ గడ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అబ్దుల్ రషీద్, తారిఫ్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో గురువారం కుట్టికోల్ లోని అడవిలో పల్లంచి నది ప్రాంతం నుంచి వెళ్తున్నారు.వాళ్లు గూగుల్ మ్యాప్ ను బేస్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఇంకేముందు దారి తప్పి కారు నది ప్రవాహంలో పడిపోయింది. అదృష్టం ఏంటంటే .. వారు బతికి బయటపడ్డారు. కానీ కారు మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. 

పల్లంచి నదిపై బ్రిడ్జిపై ప్రయణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ బ్రిడ్జీకి బారీ కేడ్స్ లేవు. వర్షాలకు బ్రిడ్జి మునిగిపోవడంతో వారికి కనిపించలేదు. దీంతో కారు నదిలో పడిపోయింది. కారు దాదాపు 150 మీటర్లు దూరం  కొట్టుకుపోయి చెట్టుకు తట్టుకొని ఆగిపోయింది. సైడ్ విండో అద్దాలనుంచి తప్పించుకొని రషీద్, తారిఫ్ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా బయటికి తీశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దాదాపు అరకిలోమీటర్ వరకు కొత్త బ్రిడ్జిని నాలుగేళ్ల క్రితం నిర్మించారు. అయితే గూగుల్ మ్యాప్.. బారీ కేడ్స్ లేని పాత బ్రిడ్జిని చూపిం ది. దీంతో ప్రమాదం జరిగింది. సో.. గూగుల్ మ్యాప్ యూజర్స్.. బీ కేర్ ఫుల్.