కశ్మీర్ సమస్యలోకి మేం ఎంటరవ్వం

  • స్పష్టం చేసిన తాలిబన్

కాబూల్ : కశ్మీర్ విషయంలో తాలిబన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాంతం భారత్ దేనని స్పష్టం చేసింది. కశ్మీర్ తమదేనంటూ పాకిస్తాన్ ఈ ప్రాంతంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఐతే పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో ఎట్టి పరిస్థితుల్లో భాగం కామని ఆ సంస్థ పొలిటికల్ వింగ్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కశ్మీర్ అనేది భారత్ అంతర్గత సమస్య అని తేల్చి చెప్పారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమనేది తాలిబన్ల విధానం కాదని ట్వీట్ లో స్పష్టంగా తెలిపారు. కశ్మీర్ సమస్య పరిష్కరమయ్యే వరకు భారత్ సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదంటూ తాలిబన్లు పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో తాలిబన్ పొలిటికల్ వింగ్ ఇదంతా తప్పుడు ప్రచారమంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో కశ్మీర్ పై పాకిస్తాన్ చేస్తున్న వింత వాదనకు తాలిబన్ల నుంచి కూడా మద్దతు లేదని తేలిపోయింది. అయినా పాకిస్తాన్ మాత్రం బుద్ది మార్చుకోవటం లేదు. కశ్మీర్ లో ఎప్పుడు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది.

Latest Updates