కశ్మీర్​ భూములు అందరూ కొనలేరు

జమ్మూ కాశ్మీర్​ అభివృద్ధికి ఆటంకంగా నిలబడ్డ ఆర్టికల్​–370 రద్దు కాగానే, ఆ ప్రాంతం అందరికీ జున్ను ముక్కలా కనిపిస్తోంది. రియల్​ ఎస్టేట్​ మొదలుకొని సినీ రంగం వరకు, ఆపిల్​ తోటల నుంచి అధికార మార్పిడి వరకు ఇకమీదట కాశ్మీర్​ ఉమ్మడి సొత్తుగా మారుతుందని భావిస్తున్నారు.  మోడీ సర్కారు ఉద్దేశం అది కాదు. ఇన్నాళ్లూ టెర్రరిజానికి  అడ్రస్​లా మారిన ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా మలచాలన్నదే కాన్సెప్ట్​.  ప్రధాని మోడీ, పార్టీ సుప్రీం అమిత్​ షా, లోకల్​ బీజేపీ నాయకులు ఇదే మాట చెబుతున్నారు.  అయితే, డొమినైల్​ బేస్డ్​ పాలసీని పాటించకపోతే… కాశ్మీర్​ కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని సోసల్​ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు.

దేశానికి బోర్డర్​లో ఉన్న జమ్మూకాశ్మీర్​ దశాదిశను మార్చటానికి మోడీ సర్కారు ‘ఆర్టికల్​–370’తోపాటు ‘ఆర్టికల్​–35ఏ’ని రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. ఆర్టికల్​–35ఏ క్యాన్సిల్​ కావటంతో అక్కడికి ఎవరైనా వెళ్లిపోయి, ఎన్ని ఎకరాల భూమినైనా కొనుకోవచ్చని అనుకుంటున్నారు. ఆ మాట నిజమే అయినా భవిష్యత్​లో అలాంటి ఛాన్స్​ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో సీలింగ్​(లిమిట్​) పెట్టాలని లోకల్​ బీజేపీ లీడర్లు తమ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

స్థానికుల హక్కులను (ముఖ్యంగా భూములు, ఉద్యోగాలకు సంబంధించినవి) కాపాడటానికి డొమిసైల్​ బేస్డ్​ పాలసీని (నివాస ప్రాతిపదికన రూపొందించే విధానాన్ని) అమలుచేయాలని బీజేపీ భావిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్​సింగ్​ సూచనప్రాయంగా చెప్పారు. దీన్నిబట్టి రానున్న రోజుల్లో పరాయి రాష్ట్రాల ప్రజలు ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు (జమ్మూకాశ్మీర్​, లఢఖ్​​లకు) వెళ్లి ఆస్తులు కూడబెట్టుకోవటం అనుకున్నంత ఈజీ కాదని అర్థమవుతోంది.

‘హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లలో ఔట్​ సైడ్​ స్టేట్​ల వాళ్లు తమకు ఇష్టమొచ్చినంత భూమిని కొనే అవకాశం లేదు. ఇదే మాదిరిగా జమ్మూకాశ్మీర్​లో ఏర్పాట్లు చేయాలని కేంద్రంలోని మా సర్కార్​కి సూచిస్తున్నాం. కాశ్మీర్​లోని కాశ్మీరీల, వాల్మీకీల, గుజ్రాల, బకర్​వాలాల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో లోకల్​ పబ్లిక్​ని అనవసరంగా భయాందోళనలకు గురిచేసే ప్రచారాన్ని ఇప్పటికైనా కట్టడి చేయాలి’ అని నిర్మల్​ సింగ్​.. మోడీ సర్కార్​కు విజ్ఞప్తి చేశారు.

భూముల ఆక్రమణలకు ఫుల్​స్టాప్​ పెట్టండి

కొందరు అనుకుంటున్నట్లుగా జమ్మూకాశ్మీర్​ ఇక ‘ఓపెన్ ఫర్​ ఆల్​’ అనే అభిప్రాయం కరెక్ట్​ కాదని స్టేట్​ బీజేపీ వైస్​ ప్రెసిడెంట్​ నరేంద్ర గుప్తా తేల్చిచెప్పారు. గతంలో అక్కడ చాలా భూములను పలుకుబడి ఉన్నోళ్లు ఎంతో మంది ఆక్రమించేసుకున్నారని, ముందు ముందు ఇలాంటి ఆగడాలు సాగవని ఆయన హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్​ డెవలప్​మెంట్​కి సంబంధించి కేంద్రం ఫ్యూచర్​లో ఏ నిర్ణయం తీసుకున్నా లోకల్స్​కే ప్రిఫరెన్స్​ ఇవ్వాలని గుప్తా అభిప్రాయపడ్డారు.

‘ఈ ఏరియాలో అవకాశాల కొరత ఉంది. ఇప్పటికీ 5 నుంచి 6 శాతం మంది మాత్రమే గవర్నమెంట్​ జాబ్స్​ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చూడాలి. తద్వారా ఆపర్చునిటీస్​ కల్పించాలి. ప్రధాని మోడీ కూడా ఈమధ్య ఇదే అన్నారు. దీనికోసం కేంద్రం అక్టోబర్​లో జమ్మూకాశ్మీర్​లో ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్​ నిర్వహించేందుకు ప్లాన్లు సిద్ధం చేస్తోంది. ఈ సదస్సు అనంతరం స్థానికంగా ఎంప్లాయ్​మెంట్​ జనరేషన్​ పెద్దఎత్తున జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని నరేంద్ర గుప్తా వివరించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇప్పటికే.. 

హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​తోపాటు మెజారిటీ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితులు ఇప్పటికే ఉన్నాయి. బయటి రాష్ట్రాల వాళ్లు హిమాచల్​ప్రదేశ్​లో సాగు భూములను ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కొనటానికి వీల్లేదు. ఇతర రాష్ట్రాల జనాలు ఉత్తరాఖండ్​లో 250 చదరపు మీటర్లకు మించి భూమిని కొనే ఛాన్స్​ లేకుండా రూల్​ పెట్టారు. నార్త్​ ఈస్టర్న్​ రాష్ట్రాల్లో ఇలాంటి మరిన్ని ఆంక్షలు, నిషేధాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్​లో కూడా ఈ తరహా కట్టుబాట్లు ఉండాలనేదే అక్కడి బీజేపీ నేతల డిమాండ్​.

అపోహ పడొద్దు

జమ్మూకాశ్మీర్​కు ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా ఉండటానికి కారణమైన ఆర్టికల్​–370ని; అక్కడ శాశ్వత నివాసానికి సంబంధించిన ఆర్టికల్–35ఏని​ తొలగించడంపై అనే క అపోహలున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా ఇక్కడికి రావొచ్చని, ప్రాపర్టీ కొనుక్కోవచ్చని అనుకుంటున్నారు.  ఏ రాష్ట్రానికైనా వర్తించే లోకల్​, నాన్​లోకల్​ క్రైటీరియా జమ్మూ కాశ్మీర్​కు కూడా వర్తిస్తాయి.  వ్యక్తి యూనియన్​ టెర్రిటరీ ప్రాంతాల్లో భూములు కొనే అర్హత పొందాలన్నా, జాబులు కొట్టాలన్నా కంపల్సరీగా నిర్దేశిత కాలం  అక్కడే ఉండాలి. దీనికోసం స్కూలు, కాలేజీల్లో చదువుకునే తరగతులను బట్టి అర్హత నిర్ణయించడం అవుతుంది. ఎప్పటి నుంచో ఉంటున్నవారికి ప్రయారిటీ ఇవ్వాలి.

– రవీందర్​ రైనా జమ్మూకాశ్మీర్​ బీజేపీ ప్రెసిడెంట్

Latest Updates